చిరూ .. పవన్ మాదిరిగానే చరణ్: నటుడు సమీర్

  • చరణ్ కి కనెక్ట్ కావడం కష్టమే 
  • కనెక్ట్ అయితే మాత్రం వదలడు 
  • ఎదుటివారిని బాగా స్టడీ చేస్తాడు   
మంచి హైటూ పర్సనాలిటీతో సమీర్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉంటాడు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా విభిన్నమైన పాత్రలను చేస్తూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి సమీర్ మెగా హీరోలతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాడు. అందువల్లనే వాళ్ల గురించి ఆయన మాట్లాడుతూ .. "చరణ్ చాలా హార్డ్ వర్కర్ .. కొంచెం రిజర్వ్డ్ గానే వుంటాడు.

అందరితో మాట్లాడతాడు .. కలిసి భోజనం చేస్తాడు .. కానీ తనకి కనెక్ట్ కావడం కష్టమే .. కనెక్ట్ అయితే మాత్రం ఇక వదలడు. ఎదుటి వ్యక్తి ఎలాంటివారు అనే విషయంపై చరణ్ ముందుగా స్టడీ చేస్తాడు. చిరంజీవి గారి నుంచి వచ్చిన క్వాలిటీ అది. కళ్యాణ్ గారు కూడా అంతే .. ఎదుటివారిని స్టడీ చేసి కరెక్ట్ అనుకుంటేనే కనెక్ట్ అవుతారు. చరణ్ తో నేనైతే చాలా ఈజీగానే కనెక్ట్ అవ్వగలిగాను. ఆయనతో కలిసి 'గోవిందుడు అందరివాడేలే' చేసిన రోజులను మరిచిపోలేను" అంటూ చెప్పుకొచ్చాడు.    
Go Back to Shorts
sameer

More Telugu News